Saturday, August 1, 2026

రాముడు హీరో… దొంగ జైలుకి!

హైదరాబాద్, అంబర్‌పేట: అంబర్‌పేట ప్రాంతంలో ఓ రిటైర్డ్ జవాన్ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించి చైన్ స్నాచర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన సంచలనంగా మారింది. వయసును లెక్కచేయకుండా దొంగను వెంబడించి నేలకూల్చిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ రాముడు స్థానికుల ప్రశంసలు అందుకున్నారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డయల్ 100కు కాల్ వెళ్లగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వ్యక్తిపై ఇప్పటికే 31 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్  జవాన్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేకంగా సన్మానించారు. “యూనిఫాం లేకపోయినా ప్రతి పౌరుడు పోలీస్‌లా బాధ్యతతో ఉండాలి” అని ఆయన అన్నారు. రిటైర్డ్ జవాన్ చూపిన సాహసం ప్రజల్లో భద్రతపై నమ్మకాన్ని పెంచిందని పోలీసులు పేర్కొన్నారు. స్థానికులు కూడా ఆయనను నిజమైన హీరోగా కొనియాడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!