హైదరాబాద్: సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం థియేటర్ ఆర్ట్స్ విభాగంలో అభ్యసిస్తున్న విద్యార్థి బి. సాయికిరణ్ ప్రతిభతో మరోసారి గుర్తింపు పొందారు.గత సంవత్సరం డిసెంబర్‌లో చెన్నైలో నిర్వహించిన సౌత్ జోన్ ఫెస్టివల్ లో సాయికిరణ్ వన్ యాక్ట్ ప్లే, మైమ్, క్రియేటివిటీ కొరియోగ్రఫీ విభాగాల్లో పాల్గొన్నారు. అందులో వన్ యాక్ట్ ప్లేలో నాలుగో స్థానం సాధించగా, మైమ్‌లో ప్రధాన పాత్ర పోషించి నాలుగో స్థానం పొందారు.ఈ సందర్భంగా గురువారం రోజు సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు చేతుల మీదుగా సాయికిరణ్ సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య నిత్యానందరావు,రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతు రావు, సినీ నటుడు ప్రదీప్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కృపాకర్ పాల్గొన్నారు. విద్యార్థి సాయికిరణ్ సాధించిన విజయానికి విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ విభాగాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
సౌత్ జోన్ ఫెస్టివల్‌లో సాయికిరణ్ ప్రతిభకు గుర్తింపు
RELATED ARTICLES

Recent Comments