Tuesday, September 29, 2026

సంఘం బలోపేతానికి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాష రాష్ట్ర పర్యటన

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్‌లో నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం సమావేశం

– జేఏసీ బలోపేతానికి అన్ని సంఘాలను కలుపుకుని ముందుకు సాగాలి: షేక్ మహబూబ్ పాషా

సూర్య ఉదయం ప్రతినిధి, మహబూబాబాద్:

నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం బలోపేతం, హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సయ్యద్ భాష మరియు రాష్ట్ర జేఏసీ నాయకులు షేక్ లాల్ జాన్ పాషా మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా జిల్లా నాయకులు వారికి ఘన స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. అనంతరం జిల్లా స్థాయిలో జేఏసీని మరింత బలోపేతం చేయడం, వివిధ సంఘాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడం, దూదేకుల ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరంపై చర్చించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు షేక్ మహబూబ్ పాషా మాట్లాడుతూ.. నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీల సమస్యలు, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జేఏసీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసి, అన్ని సంఘాలను కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. హక్కుల సాధన కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీ, కోశాధికారి మహ్మద్ యాకుబ్ పాషా, గౌరవ అధ్యక్షులు మహ్మద్ రంజాన్, గౌరవ సలహాదారు మహ్మద్ పాషా, రాష్ట్ర నాయకులు మహ్మద్ నాసర్, మహ్మద్ హస్సేన్, మండల అధ్యక్షులు మహ్మద్ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments