Friday, August 7, 2026

జేఎన్టీయూ హెచ్ నూతన రిజిస్టర్ గా డాక్టర్ ఏ.జయలక్ష్మి నియామకం…

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి….

కూకట్పల్లి లోని జేఎన్టీయూ హెచ్ నూతన రిజిస్టర్ గా డాక్టర్ ఏ.జయలక్ష్మి నియమితులయ్యారు. యూసీఈఎస్‌టీహెచ్ లోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం యొక్క ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డా. ఎ. జయ లక్ష్మి, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌కు రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. గత 54 సంవత్సరాల జెఎన్టియు హెచ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళ రిజిస్టర్ గా డాక్టర్ ఏ జయలక్ష్మి నియామకం కావడం విశేషం. గతంలో ఇదే జేఎన్టీయూ క్యాంపస్లో ఆమె ప్రిన్సిపాల్ గా తధనంతరం డైరెక్టర్ గా పనిచేసి విధులను సమర్థవంతంగా నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. కాగా యూసీఈఎస్‌టీహెచ్ లోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క నానో టెక్నాలజీ ప్రొఫెసర్ డా. కె. వెంకటేశ్వర రావు నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జెఎన్టియు విద్యాపక బృందం, విద్యా ప్రముఖులు పలువురు డాక్టర్ జయలక్ష్మి కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!