Friday, August 7, 2026

దివంగత ముఖ్యమంత్రి డా. వై ఎస్ ఆర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

– లబ్ధిదారుల సమక్షంలో జయంతి ఉత్సవాలు…

సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్ పల్లి: ఎన్ని సంవత్సరాలు గడిచినా రాజన్నను మరువలేమని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నంత కాలం ఆయన చిరస్మరణీయంగా ఉంటారని ఎమ్మెల్సీ శివరామరెడ్డి, వైయస్ఆర్సీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు వై. ఈశ్వరప్రసాదొడ్డి, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిలు అన్నారు. కేపీహెచ్బీకాలనీ సర్దార్ పటేల్ నగర్ లోని మొఘలాస్ ప్యారడైజ్ రెస్టారెంట్లోని బ్యాంకెట్ హాలులో జులై 8వ తేదిన దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ శివరామరెడ్డి, వైయస్ఆర్సీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు వై. ఈశ్వరప్రసాదొడ్డి, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిలు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లు సురేంద్ర రెడ్డి, ఇంటలేక్చువల్ జనరల్ సెక్రటరీ సుబ్రమణ్యం రెడ్డి, వైయస్సార్ సేవా సంఘం అధ్యక్షులు రామచంద్ర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ గోపాల్, గంగిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి,ప్రభాకరరెడ్డి, పెద్దలు చంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఇండస్ట్రీయలిస్ట్ సత్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!