Tuesday, April 21, 2026

కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ……

 

సూర్య ఉదయం ప్రతినిధి కుత్బుల్లాపూర్..

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ లోని కార్యాలయంలో దుండిగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆకుల భరత్ కుమార్ కుమారుడి కంటి ఆపరేషన్ కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు ఈరోజు తన కార్యాలయంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. భరత్ కుమార్ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలలో తన చురుకైన భాగస్వామ్యానికి, నిబద్ధతకు విస్తృతంగా గౌరవించబడ్డారు. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోవటం జరిగింది , ఆయన కుటుంబం కష్టకాలంలో ఉంది. , ఆయన కుమారుడికి అత్యవసర కంటి ఆపరేషన్ అవసరం కావడంతో, కుటుంబంపై ఆర్థిక భారం పడింది. పరిస్థితిని అర్థం చేసుకుని వారి కుటుంబానికి తన కార్యాలయంలో వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు..*

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ తన నిబద్ధత గల కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పార్టీకి ఆయన చేసిన అంకితభావ సేవకు గౌరవ సూచకమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు అమరం గోపాల్ రెడ్డి గారు, జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఆనంద్ కుమార్, శంకర్ నాయక్, మహేందర్ యాదవ్, భరత్ కుమార్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి క్రిష్ణ, BRS పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్ గౌడ్, మహేష్ దారా, విష్ణు యాదవ్, వీరేష్, శ్రీశైలం యాదవ్, శ్రీకాంత్ యాదవ్, అభి, మరియు కుటుంబ సభ్యులు ఆకుల భాస్కర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!