Saturday, June 27, 2026

శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సగర సంఘం నేతలు…

 

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…

దేశ ప్రజలంతా పవిత్రంగా ఆరాధించే లోకాభిరాముడైన శ్రీ రాముని పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిని ఖండిస్తూ జగద్గిరిగుట్ట సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల కేరళలో జరిగిన సాహిత్య ఉత్సవం సందర్భంగా పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామలక్ష్మణులను వలస కూలీలుగా వర్ణిస్తూ దక్షిణ భారతానికి చెందిన రావణుని పొలంలో రామలక్ష్మణులు పండ్లు దొంగిలించారని ఇది చూసిన రావణాసురుడి చెల్లెలు సూర్పనఖ జీఎస్టీతో కలిపి 2 వేల డాలర్లు కట్టాలని చెప్పడంతో రాముడికి, రావణాసురుడికి వివాదం మొదలైందని వ్యంగ్యంగా మాట్లాడారు. నిత్యం 100 కోట్ల మంది ప్రజలు పవిత్రంగా ఆరాధించే మా కుల దైవమైన శ్రీరాముని కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజు పై కేసు నమోదు చేయాలని జగద్గిరిగుట్ట సగర సంగం సభ్యులు సిఐ వెంకటేశంకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్ పై సినీ పరిశ్రమ ప్రత్యేక చర్యలు తీసుకొని సినిమా అవకాశాలు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేముల సుదర్శన్ సాగర్, ప్రధాన కార్యదర్శి ఎం. ఎస్. భీమయ్య సాగర్, కోశాధికారి ఎం. వెంకటరమణ సాగర్, స్టీరింగ్ కమిటీ వైస్ చైర్మన్ మోడల రాములు సాగర్, ఆస్కానీ శ్రీనివాస్ సాగర్, రాచాల శ్రీనివాస్ నగర్, డి. శ్రీరాములు సాగర్,ఆర్కే. దయాసాగర్, ఎన్. రామకృష్ణ సాగర్, కెపి. కిషోర్ సాగర్, సుమన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!