Friday, August 7, 2026

ప్రశాంత్ నగర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి  జయంతి పోస్టర్ ఆవిష్కరణ..

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…..

గురువారం నాడు పాలెం రఘునాథ రెడ్డి , రావుల నరసింహా రెడ్డి  ఆధ్వర్యంలో ప్రశాంతినగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో జూలై 8న నిర్వహించనున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి లోని బాలాజీనగర్,వివేకానంద నగర్,మోతీనగర్,భరత్ నగర్ ,విజ్ఞానపురి కాలనీ,ప్రశాంతినగర్ ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వై. ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి  మాట్లాడుతూ, వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు అందరూ జూలై 8న జరగనున్న జయంతి కార్యక్రమానికి తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు ఏ.పీ. రెడ్డి , మునిరెడ్డి , ఎస్వీఎస్ రెడ్డి , సురేందర్ రెడ్డి  ప్రకాష్ రెడ్డి , ప్రవీణ్ కుమార్ రెడ్డి , సంజీవ్ , శ్రీనివాస్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!