Tuesday, September 29, 2026

దేశ అభివృద్ధిలో యువతపాత్ర కీలకం

📰 Generate e-Paper Clip

కూకట్ పల్లి:

 

పార్టీ అభివృద్ధి కోసం మన బాధ్యతను మనం చేస్తూ పోతే నాయకులను గుర్తించే బాధ్యతను పార్టీ చూసుకుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సలీం ఆధ్వర్యంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ బుధవారం కెపిహెచ్బి కాలనీ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి రమేష్ హాజరై యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఏ పార్టీకైనా యువతే వెన్నెముకగా నిలుస్తుందన్నారు. పార్టీ అభివృద్ధిలో దేశ అభివృద్ధిలో యువతపాత్ర కీలకమన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయడం ద్వారా గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు. పార్టీ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడం ద్వారా వారికి మరింత దగ్గర కావచ్చని తద్వారా మరిన్ని అవకాశాలు అంది వస్తాయన్నారు. పనితీరుతో తనకు పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు. నియోజకవర్గంలో రమేష్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దేశంలో రాహుల్ గాంధీ (ఆర్ ఆర్ ఆర్, త్రిబుల్ ఆర్) నాయకత్వాన్నీ బలపరచాలని పార్టీని గెలిపించేందుకు ప్రతినాయకుడు ప్రతి కార్యకర్త నేటి నుంచే గట్టిగా కృషి చేయాలి సూచించారు. ఈ కార్యక్రమంలోయూత్ స్టేట్ ఇంచార్జీ భవ్య, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఇంచార్జీ రామ్ ప్రసాద్, స్టేట్ సెక్రటరీ రమ్య, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మక అజయ్, మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments