Friday, August 7, 2026

కార్మికులకు ఎల్లప్పుడు అండగా నిలుస్తున్న కార్మికు నాయకుడు రవి..

 

రెడీమిక్స్ లారీ డ్రైవర్‌కు రావలసిన వేతనం ఇప్పించిన

-బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి…

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి

శంషాబాద్ ఏరియాలోని “కే ఎన్ ఆర్ రెడీమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ” లో లారీ డ్రైవర్‌ గా సోను అనే డ్రైవర్ గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు డిసెంబర్ నెల రావాల్సిన వేతనం 27,000/-వేల రూపాయలు అతను ఎంత అడిగినా ఏదో ఒకటి చెప్పి అతనికి డబ్బులు ఇవ్వకుండా మాయమాటలు ఓనర్ నవీన్ రెడ్డి చెప్పి పంపించేవారు… అతనికి ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారని తోటి డ్రైవర్లను అడిగి తెలుసుకుని శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి కార్యాలయం దగ్గరికి వెళ్లి అతనికి జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు.. వెంటనే స్పందించిన శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి హుటాహుటిన.. కేఎన్ఆర్ రెడీమిక్స్ యజమాన్యం ఓనర్ నవీన్‌ రెడ్డి తో మాట్లాడి డ్రైవర్ సోనుకు రావాల్సిన 27,000/- రూపాయల వేతనం మొత్తం సోను కు ఇప్పించారు..కార్మికుల పక్షాన నిలిచి సమస్య పరిష్కరించిన రవి ని సోను అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, నర్సింగ్, సిపిఐ చారి, తల్వార్ సింగ్, తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!