Friday, August 7, 2026

సామాజిక మాధ్యమాలలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దు

హైదరాబాద్: నూర్ భాషా దూదేకుల కులుస్తుల్ని పింజారిగా మార్చాలని సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం జరుగుతుంది అట్టి ప్రచారంపై తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ని కలిసిన దూదేకుల రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ భాష వినతి పత్రం అందజేశారు. దీనిపై వివరణ కోరగా దానికి వారు స్పందిస్తూ మేము ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు అనే సమాధానం ఇచ్చారు. అందువలన సామాజిక మాధ్యమాలలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని నూర్ భాషా దూదేకుల కులస్తుల్ని కోరడం జరుగుతుంది మరియు ఇప్పుడు జరుగుతున్న జనగణలో నూర్ భాషా దూదేకుల జనాభా ఎంతో తేల్చేలా కేంద్ర బీసీ కమిషన్ కి రిప్రజెంటేషన్ చేయాలని కోరుతున్నాము అని రాష్ట్ర అధ్యక్షులు కోరారు. దానికి వారు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానే హామీ ఇచ్చారు . మరి ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న నూర్ భాషా దూదేకుల కులస్తులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ భాష, ఎంబిసి విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బడే సహేబ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!