చుట్టూ ప్రహరీ గోడ
భారీ షెడ్లు నిర్మాణం..
మంది మార్బలంతో సెక్యూరిటీ ఏర్పాటు…
రెవెన్యూ అధికారులారా.. ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా.. మరి మీరు ఎక్కడ…
ఈ కబ్జాల వెనుక ఎవరు….
సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి….
మాదాపూర్ జోన్…..
కూకట్ పల్లి నియోజవర్గం లో నూతనంగా ఏర్పడ్డ డివిజన్ మాదాపూర్ జోన్ లో విష్ణు విస్తారా సమీపంలో భారీగా అక్రమ భూకబ్జాలు. హైటెక్ సిటీ కూత వేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో గజము ధర మూడు లక్షల రూపాయలు పలుకుతున్నది, కానీ కొందరు వ్యక్తులు దీని అదునుగా చూసుకొని ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు ఒక్కొక్కరు వెయ్యి గజాల పైన కబ్జా చేసి పెద్ద బౌండరీ కట్టి దానిలో కొంతమంది మనుషులను కాపలా పెట్టినారు అక్కడికి ఎవరైనా వెళ్లి ఆరా తీస్తే మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మరి ఇంత దౌర్జనంగా భూ అక్రమానికి పాల్పడుతుంటే మరి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు,
భూకబ్జాకి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతున్నది. ఈ కబ్జాలు చేస్తున్న వారి పేర్లు కూడా బయటకి వస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త కబ్జారాయుల్లారా…
మరి దీనిపై రెవెన్యూ అధికారులు ఆర్ ఐ ఎందుకు దృష్టి సారించడం లేదని వారికి కంటికి కానరావడం లేదా లేక ముడుపులు తీసుకొని భూకబ్జా కోర్లకు అండగా నిలుచుంటున్నారా అనే ప్రశ్న మసులుతున్నది..

Recent Comments