హైటెక్ సిటీకి కూతవీటి దూరంలో 400 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే రెవెన్యూ అధికారులు హైడ్రాధికారులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ సర్వేనెంబర్ 18లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో 4 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తెలుగు మీడియం ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలకు రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించి జిహెచ్ఎంసి ద్వారా చుట్టూరా ప్రహరీ గోడ కట్టాలని చెప్పాం. గత ఆరు సంవత్సరాలుగా కోర్టులో స్టే ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వ స్థలం అని రుజువు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అప్పటి నుంచి కలెక్టర్ మంత్రులకు వినతి పత్రాలను అందజేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాలను నిర్మించాలని కృషి చేశానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు.
కానీ రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కుమ్మక్కై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి సుమారు 400 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జాదారులు ఏకంగా స్థలంలో మట్టి నింపి ఇంటి నిర్మాణం కోసం జెసిబి తో గుంటలు తీస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని మాటలు చెప్పే హైడ్రాధికారులకు 400 కోట్ల విలువ చేసే భూములు గద్దల్లాగా వాలి కబ్జాలు చేస్తుంటే కనబడట్లేదా అని ఎమ్మెల్యే అన్నారు. హైడ్రాధికారులకు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలంలో కబ్జాలు నిలిపివేయాలని ప్రభుత్వ పాఠశాలకు చెందేలా చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
ప్రభుత్వం కానీ రెవెన్యూ అధికారులు కానీ 400 కోట్ల విలువ చేసే భూమిని కాపాడి పాఠశాలకు చెందే విధంగా కృషి చేయాలి తప్ప కబ్జాదారులకు మద్దతుగా నిలబడి పని చేస్తే చూస్తూ ఊరుకోనని కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందే విధంగా కష్టపడతానని కబ్జాదారులపై అధికారులు క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఊరుకోనని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్, ఐలయ్య, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Recent Comments