సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి సైబరాబాద్…
శ్రీమతి జి. అఖిల వయస్సు 26 సంవత్సరాలు శ్రీనివాస్ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎలూరు నివాసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు.
తేదీ 23-04-2026 రాత్రి సుమారు 10:10 గంటల సమయంలో కేపీహెచ్‌బీ లోని నెక్సస్ మాల్లో తన బ్రేస్లెట్ పోగొట్టుకున్నారు.
తరువాత గుర్తించి, 24-04-2026 మధ్యాహ్నం 01:00 గంటలకు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని సవాల్‌గా తీసుకున్న SHO శ్రీ ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు, DI శ్రీ కె.ఎస్. రవి , క్రైమ్ టీమ్ సభ్యులు రఘు మరియు సురేష్‌లతో కలిసి త్వరితగతిన విచారణ చేపట్టి, కేవలం 24 గంటల్లోనే బ్రేస్‌లెట్‌ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
తరువాత ఆ బ్రేస్‌లెట్‌ను జి. అఖిల కి అందజేశారు.
దీనిపై ఆమె కేపీహెచ్‌బీ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేపీహెచ్‌బీ పోలీసుల సేవలకు అభినందనలు

Recent Comments