Monday, April 20, 2026

కేపిహెచ్బి లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు  టిడిపి సీనియర్ నాయకులు షేక్ సత్తార్…

సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్ పల్లి:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని, కేపిహెచ్బి 114 డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జేఎన్టియు సర్కిల్ లో గల ఎన్టిఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రమ్యా గ్రౌండ్ వరకు ర్యాలీగా వెళ్ళి కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి, మిఠాయిలు, మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టారు. వినాయక గుడి దగ్గర మజ్జిగ, అరటిపండ్లు, పూతరేకులు పంచి పుట్టినరోజు సంబరాలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వసంత నగర్ ఎన్టిఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యురాలు ఉప్పల పద్మా చౌదరి, డివిజన్ సీనియర్ నాయకులు షేక్ సత్తార్, అట్లూరి దీపక్, శివ సత్యనారాయణ, వాసిరెడ్డి లక్ష్మీనారాయణ, కొల్లూరి శ్రీనివాస్, కాకర్ల గోపికృష్ణ, చిరుమామిళ్ల ఉమ, సుబ్బారావు, జాస్తి రమాదేవి, చందర్రావు, రామకృష్ణ, దొప్పలపూడి మదన్మోహన్, కిషోర్ కొర్రపాటి, చెరుకూరి రవి, పవన్ మార్ని, దొరబాబు, సాంబశివరావు, ఆనందరావు, కోటి, కొండల్ రావు, విక్రమ్ సింహ, సాయి, మణికంఠ వర్మ, వెంకట్, రాజా, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!