
మానసిక దృఢత్వాన్ని పెంపొందించే గొప్ప కళ.. ప్రీతం రెడ్డి..
సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి:
కూకట్ పల్లి కే పి హెచ్ బి 4వ ఫేస్ షటిల్ కోర్ట్ నందు స్థానికంగా నిర్వహించిన కరాటే పోటీలలో గెలుపొందిన వారికీ బెల్టులు మరియు సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. గాడ్స్ ఓన్ వారియర్స్ షోటోకన్ కరాటే అకాడమీ వారి ఆధార్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిహెచ్ఎంసి కాంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రీతమ్ రెడ్డి, సూర్య ఉదయం దినపత్రిక తెలంగాణ ఎడిటర్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కరాటే అకాడమీ మాస్టర్ అబ్దుల్ నబీ ఫౌండర్ మాస్టర్ వీ పృథ్వీరాజ్, సీనియర్ మాస్టర్ శ్రీశైలం, శ్రీనివాస్ లు ముఖ్య అతిధులను శాలువాలతో సన్మానించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. వివిధ స్థాయిల్లో శిక్షణ పూర్తి చేసి బెల్ట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అతిధులు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరాటే కేవలం ఆత్మరక్షణ విద్య మాత్రమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని పెంపొందించే గొప్ప కళ అని పేర్కొన్నారు. విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. కరాటే మాస్టర్ పృద్వి రాజ్, సీనియర్ మాస్టర్ శ్రీశైలం లు మాట్లాడుతూ, విద్యార్థులు ఎంతో కృషితో శిక్షణ పూర్తి చేసి బెల్ట్ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. తల్లిదండ్రులు అందించిన సహకారం వల్లే విద్యార్థులు ఈ విజయాలను సాధించగలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు హుస్సేన్, బిజేఎంఎం జిల్లా స్పోక్స్ పర్సన్ సులోచన, బీజేవైఎం నాయకులు భార్గవ్, శ్యామ్, విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు పాల్గొన్నారు.

Recent Comments