Tuesday, September 29, 2026

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన జనసేన నాయకులు: ప్రేమ కుమార్…

📰 Generate e-Paper Clip

సూర్య ఉదయం  కూకట్ పల్లి…

జనసేన పార్టీ PAC ఛైర్మన్ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్  తండ్రి, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు  పరమపదించారనే దుఃఖవార్త తెలిసిన వెంటనే, జనసేన నాయకులు జూబ్లీ హిల్స్ ‌లోని వారి నివాసానికి చేరుకుని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ , మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ , జనసేన నాయకులు కొల్లా శంకర్ , పోలేబోయిన శ్రీనివాస్  కలిసి మనోహర్ ని పరామర్శించి, మనోధైర్యం చెప్పి, సానుభూతి వ్యక్తం చేరారు.  ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, వారి కుటుంబానికి ఈ లోటు తీరనిదని, కానీ భాస్కర్ రావు వారి సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి భాస్కర్ రావు  రాష్ట్ర రాజకీయాలలో విశిష్టమైన స్థానం సంపాదించారని, ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. ఆయన మరణం రాష్ట్రానికి పెద్ద లోటు అని అభిప్రాయపడి, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు అందరూ కలసి భాస్కర్ రావు  పర్దీవ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments