Sunday, June 28, 2026

చైన్ స్నాచర్స్ ను పట్టుకున్న మియాపూర్ పోలీసులు 

 

సూర్య ఉదయం ప్రతినిధి, మియాపూర్:

 

మియాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విశేష కృషి చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల వివరాలను మియాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ తెలుపుతూ కొత్తకోట గోవిందరావు (28) పర్వత్‌నగర్, అల్లాపూర్ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న గణపతిరాజు వీర వెంకట సత్యనారాయణ రాజు భార్య గణపతిరాజు సత్యవాణి నుండి ఒక ఫిర్యాదు అందుకోవడం జరిగింది. ఫిర్యాదులో ఈ నెల12న ఉదయం సుమారు 06:30 గంటల సమయంలో మార్నింగ్ వాక్ కోసం హుడా పార్కుకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో స్వస్తిక్ హాస్పిటల్ సమీపంలో ఒక ఇంటి ముందు పూజ కోసం పూలు కోయడానికి వెళ్లిన ఆమె అదే సమయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి, ఆమె పక్కనే ఆగి, ఒక్కసారిగా వెనుక నుండి దాడి చేశాడు. ఆమె మెడలోని గొలుసును (మంగళసూత్రం) బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె తన గొలుసును పట్టుకుని ప్రతిఘటించినప్పటికీ, ఆ వ్యక్తి మళ్ళీ బలాన్ని ఉపయోగించి గొలుసును లాక్కొని మోటార్ సైకిల్‌పై అక్కడి నుండి పరారయ్యాడు. ఈ హఠాత్ దాడి కారణంగా ఆమె మెడపై స్వల్ప గాయాలయ్యాయి. సదరు అపరిచిత వ్యక్తి వయస్సు సుమారు 20-30 ఏళ్ల మధ్య ఉంటుందని, అతను నల్లటి దుస్తులు మరియు హెల్మెట్ ధరించి ఉండటం వల్ల ముఖం సరిగ్గా కనిపించలేదని ఆమె తెలిపారు. అయితే, ఆ వ్యక్తి మళ్ళీ కనిపిస్తే తాను గుర్తుపట్టగలనని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటన సమయంలో గొలుసు బలవంతంగా లాగబడింది. నేరస్తుల వయస్సు సుమారు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. వారు మళ్ళీ కనిపిస్తే తాను గుర్తుపట్టగలనని ఫిర్యాదుదారురాలు తెలిపారు. కావున, ఆ అపరిచిత నేరస్తులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

దీనిపై మియాపూర్ పోలీస్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టి, లభ్యమైన ఆధారాలపై పనిచేసి, బైక్‌పై సంచరించే నేరస్తున్నిగుర్తించి విజయవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడైన కొత్తకోట గోవిందరావు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఒంటరిగా కనిపించే మహిళలను గుర్తించి, అతను గొలుసు దొంగతనాలకు (స్నాచింగ్) పాల్పడేవాడు. దొంగిలించిన బంగారాన్ని అమ్మగా వచ్చిన డబ్బును వారు జలసాల కోసం ఖర్చు చేసేవారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ల పరిమితుల్లో ఈ నేరాలు జరిగాయి. నేరం సమయంలో ఉపయోగించిన బైక్ నెంబర్ ప్లేట్‌ను సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి, నిందితులు నివసిస్తున్న ప్రదేశానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం కేసుకు సంబంధించిన ప్రాపర్టీని రికవరీ చేసుకోవడం జరిగింది. నిందితుడు నుండి 2 రోల్డ్ గోల్డ్ చైన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడును పట్టుకొవడం లో మియాపూర్ పోలీసులను అభినందించారు. వారికీ తగిన విధంగా అభినందించి పురస్కరించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో భారీ బంగారు గొలుసులు ధరించకుండా ఉండాలని, ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పండుగలు లేదా ఒంటరిగా ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, గొలుసును దుపట్టా, చీర పల్లూ, షర్ట్ లేదా స్కార్ఫ్ లోపల దాచుకోవాలని, రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!