హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు, మెట్రో స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ ఘటన భాగ్యనగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపు కాల్తో పోలీసులు, మెట్రో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలిసి ప్రయాణి కులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళ ఉప్పల్ మెట్రో స్టేషన్ లో వేలాది మంది ప్రయాణి కులతో కిటకిటలాడుతుంటుంది. ఈ క్రమంలోనే పోలీసు కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ ఆవరణలో బాంబు పెట్టామని, అది కాసేపట్లో పేలిపోతుందని ఆగంత కుడు బెదిరించాడు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయ కుండా మెట్రో సెక్యూరిటీ విభాగం ఉప్పల్ పోలీసు లకు సమాచారం ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు స్టేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ స్టేషన్కు చేరుకున్నాయి. స్టేషన్ లోపల ఉన్న డస్ట్ బిన్లు, పార్కింగ్ ఏరియా, టికెట్ కౌంటర్ల వద్ద నిశితంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా, స్టేషన్లో ఉన్న ప్రయాణికు లను వెంటనే బయటకు పంపించారు. కాసేపు మెట్రో రైళ్ల రాకపోకలను కూడా నిలిపి వేసినట్లు సమాచారం. అనుమానాస్పద బ్యాగులు లేదా వస్తువుల కోసం ప్రతి అంగుళాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

Recent Comments