Tuesday, September 29, 2026

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కెపిహెచ్బి డివిజన్లో పర్యటన..

📰 Generate e-Paper Clip

కమ్యూనిటీ హాల్  పార్కులు చెత్తాచెదారంలో….

కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అనేదే లేదు.. ప్రభుత్వంపై మండిపడ్డ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

ప్రజల సమస్యను పట్టించుకోనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం..

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…..

 

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  సోమవారం కె.పి.హెచ్.బి డివిజన్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ప్రధానంగా గతంలో నిధులు మంజూరూ అయ్యి జరుగుతున్న నూతన పైపు లైనులు ,రోడ్లు పనులు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కెసిఆర్ ప్రభుత్వం హయాంలో కూకట్పల్లి నియోజకవర్గం లో కేపిహెచ్.బి డివిజన్ కు వందల కోట్ల నిధులు మంజూరు చేయించి నిరుపేదలకు ఉపయోగపడేటట్లు అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నామని ఇందులో ప్రధానంగా నాలుగో ఫేస్ లోఉంటున్న నిరుపేదలకు మరియు ఇతర ప్రాంతాల వారికి ఉపయోగపడేటట్లుగా అత్యాధునిక సదుపాయాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని అడిగితే కాంగ్రెస్ నాయకుల దగ్గర తాళాలు ఉంచుకుని ఈ కమ్యూనిటీ హాల్ కు చెత్తాచెదారం బూజులు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇదా అభివృద్ధి? నిరుపేదలకు తక్కువ రుసుముతో వారికి శుభకార్యాలు చేసుకునే విధంగా దీన్ని ఉపయోగించాలని ఉద్దేశంతో కట్టించామని.. కనీసం అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులకు భయపడి ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రాపర్టీలను నిర్వీర్యం చేస్తున్నారని… ఇప్పటికైనా ప్రజలు దీన్ని గమనించాలని కోరారు.. అలాగే మహిళా మండలి భవనం కూడా మహిళలకు ఉపయోగపడే విధంగా నిర్మించామని దాన్ని కూడా ఇదే స్థితిలో తీర్చిదిద్దారని ఆవేదన వ్యక్తం చేశారు.. గతంలో నిరుపేదలకు మంచినీరు ఇబ్బంది రాకుండా పైపు లైనులు వాటర్ ట్యాంకులు నిర్మించడమే కాకుండా ఉచిత మంచినీటిని అందించామని.. ఇప్పుడు నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజలకు ఉపయోగపడే పార్కులు, సిమ్మింగ్ పూల్స్ ఇండోర్ స్టేడియంలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే కాంగ్రెస్ నాయకులు వాటన్నింటికీ బూజు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కనీసం ప్రజల గురించి కూడా ఆలోచించడం లేదని.. తాను ఎప్పుడూ అభివృద్ధికి సహకరిస్తానని కానీ ఈ విధంగా చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, రాజేష్అ రాయ్, జున్ను సాయి శ్రీనివాస్, పాతూరి గోపి, భారతి, అన్ని విభాగాల అధికారులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments