Tuesday, September 29, 2026

కేపీహెచ్‌బీ కాలనీలో ఘనంగా మందలపు సాయిబాబు చౌదరి 51వ జన్మదిన వేడుకలు….

📰 Generate e-Paper Clip

 

 

అటు రాజకీయం ఇటు బిజినెస్ ప్రజాసేవ లో తనకంటూ ఒక ముద్ర వేసుకునీ అందరివాడు ఆత్మీయుడుగా నిలిచాడు మన సాయిబాబు చౌదరి…

 

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి….

కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజామనిషి, సామాజిక సేవకులు మందలపు సాయిబాబు చౌదరి 51వ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, అనుచరులు, మిత్రులు మరియు స్థానిక ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేసి, పుష్పగుచ్ఛాలు, గజమాలలతో సన్మానించారు. బాణాసంచా కాల్చి, నినాదాలతో జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు.

పలువురు వక్తలు మాట్లాడుతూ మందలపు సాయిబాబు చౌదరి గారు గత 25 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. కరోనా కాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ, వరదలు మరియు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పేదలకు వైద్య సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు  బండి రమేష్  స్వయంగా మందలపు సాయిబాబు చౌదరి కి బొకే అందజేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బండి రమేష్  మాట్లాడుతూ, మందలపు సాయిబాబు చౌదరి  ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న నాయకుడు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నాను. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమైనవి అని పేర్కొన్నారు. అలాగే ఆయనకు ఆశీర్వాదాలు అందజేస్తూ, ఆయురారోగ్యాలతో నిండి ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం అభిమానులు, మిత్రులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ సంఘాల నాయకులు మందలపు సాయిబాబు చౌదరి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments