సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్ పల్లి:

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పార్టీ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మరియు సోషల్ మీడియా వారియర్ దూసి సూర్యవెంకట శివానంద సాయి (ఆనంద్) జన్మదిన సందర్భంగా కూకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ ఎమ్మెల్యే ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ కూకట్ పల్లి కోఆర్డినేటర్ సతీష్ అరోరా, పాతూరి గోపి, రాజేష్ రాయ్, జున్ను సాయి, పెద్ద కిషోర్ లు కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ రావు ను కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీలో మరింత చురుకుగా పనిచేస్తూ కాలనీలో ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మేము ఎల్లపుడు అండగా ఉంటాం అని మందడి శ్రీనివాస్ రావు అన్నారు. జన్మదిన సందర్భంగా నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

Recent Comments