గుంటూరు: గుంటూరులోని గోపాలకృష్ణయ్య యానాది కాలనీ కమ్యూనిటీ హాల్ నందు నవ్యాంధ్ర యానాది యువ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంఘం యొక్క నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా బాపట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులుగా తలపల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా తుపాకుల ఉమామహేశ్వరరావు, కోశాధికారి చేవూరి త్రివేణి, అధికార ప్రతినిధిగా పొట్లూరి హనుమంతురావు, ఉపాధ్యక్షులుగా యాటగిరి శంకర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ఇండ్ల దయానందం, కోమరిగిరి బాల అంకయ్య, తలపల వెంకట్, పొట్లూరి శ్రీకాంత్, ఇండ్ల గంగయ్య, ఇండ్ల రోశమ్మ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ యానాది జాతి పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యానాదులకు ఇచ్చిన ప్రధాన హామీ అయిన “ప్రత్యేక కార్పొరేషన్” ఏర్పాటు సాధనే లక్ష్యంగా పని చేస్తామని వారు పేర్కొన్నారు. యానాది యువతను ఏకం చేస్తూ, వారి సంక్షేమం కోసం రాష్ట్రస్థాయిలో పోరాడుతామని ఈ సందర్భంగా వెల్లడించారు.
నవ్యాంధ్ర యానాది యువ సమాఖ్య నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
Previous article

Recent Comments