Tuesday, September 29, 2026

ఘనంగా సీనియర్ పాత్రికేయులు నజీర్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్ పల్లి:–

కూకట్పల్లి సీనియర్ పాత్రికేయులు నజీర్ జన్మదిన సందర్భంగా ఎల్లమ్మబండ లోని కమిటీ హాల్ నందు శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక కాలనీ వాసులు విలేకరులు రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగించుకున్నారు. అనంతరం కాలనీవాసులు రాజకీయ నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చల అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ సూర్య ఉదయం దినపత్రిక తెలంగాణ ఎడిటర్ భాషా, స్థానిక విలేకరులు క్రాంతి కుమార్ మిత్రులు బుజ్జి లు పూలమాలలతో శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ పాత్రికేయులు నజీర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల తరపున ప్రజా సమస్యలను తన వార్త కథనాలతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments