టీడీపీ మహానాడు లో తెలంగాణ అనే పదం లేదంటావా బక్కని నర్సింహులు ఖాబార్ధార్….. తెలంగాణ ఉద్యమకారుడు పట్లోళ్ళ సాయినాథ్ రెడ్డి
…
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింలు వెంటనే క్షమాపణ చెప్పు, తెలంగాణా ఉద్యమకారుడు పట్లోళ్ళ సాయినాథ్ రెడ్డి..
సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…
తెలంగాణ అనే పదం లేదంటావ ముందు తెలంగాణ అంటే తెలుసుకొని మాట్లాడు.నర్సింలు మాట్లాడిన మాటలను వెంటనే చంద్రబాబు నాయుడు కండించాలి తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేనియెడల తెలంగాణా లో ఒక టీడీపీ నాయకుడిని తిరుగనివం, తెలంగాణ లో టీడీపీ జెండా లేకుండా చేస్తాం అని హెచ్చరించిన తెలంగాణ ఉద్యమ కారుడు పట్లోళ్ళ సాయినాథ్ రెడ్డీ . తెలంగాణా కోసం నీకు ఎమ్ తెలుసు చరిత్ర తెలియకుండా ఇష్టం వచినట్టు మాట్లాడడం తెలివి లేని దదామా ముందు చరిత్ర తెలుసుకో. తెలంగాణా అంటే
అది నిఘంటువులో వెతికే పదం కాదు…నిప్పుల కుంపటిలో పుట్టిన చరిత్ర!
అది అక్షరాల కలయిక కాదు…అమరుల ఆత్మగౌరవ గర్జన!
కాళేశ్వరం ఘంటానాదంలో వినిపించిన పేరు…కాకతీయుల ఖడ్గ ధ్వనిలో ప్రతిధ్వనించిన గౌరవం…త్రిలింగ దేశం నుంచి తిలింగ, తెలింగ, తెలంగాణగాకాలగర్భంలో రూపుదిద్దుకున్న నాగరికత!
తెలంగాణ లేదంటావా…?
అయితే చెప్పు…రజాకార్ల రక్తపాతానికి ఎదురు నిలిచినవీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ నేలది. యువకుల త్యాగాలు,వేలాది ఉద్యమకారుల కన్నీళ్లు,లక్షలాది ప్రజల ఆకాంక్షలతోపుట్టుకొచ్చిన రాష్ట్రం పేరు తెలంగాణ!
తెలంగాణా ఒక పదం కాదు…
అది సమ్మక్క-సారలమ్మల తిరుగుబాటు!
అది భద్రాచల రామయ్య భక్తి!
అది గోల్కొండ గర్వం!
అది బతుకమ్మ సంస్కృతి!
తెలంగాణ లేదని ఎగతాళి చేసే వారికి చెప్పండి…
నిఘంటువుల్లో పదాలు పుడతాయి…కానీ తెలంగాణలాంటి పేర్లుప్రజల గుండెల్లో పుడతాయి!
చరిత్ర పుటల్లో నిలుస్తాయి!
తెలంగాణను వెతకాలంటే…డిక్షనరీలో కాదు…
అమరవీరుల రక్తంలో చూడాలి!
ఎందుకంటే…
తెలంగాణ ఒక పదం కాదు…ఒక చరిత్ర!ఒక సంస్కృతి!ఒక స్వాభిమానం!ఒక ఉద్యమం!ఒక జాతి ఆత్మగౌరవానికి ప్రతీక!అని తెలుసుకో మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దార్.. పట్లోళ్ళ సాయినాథ్ రెడ్డీ తెలంగాణా ఉద్యమకారుడు కూకట్పల్లి.

Recent Comments