
కూకట్ పల్లి: కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ హెచ్‌పీ రోడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో గల గాయత్రి ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కార్మికురాలు విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె కుడి చేయి రెండు వ్రేలు తీవ్రంగా చితికిపోయాయి. ప్రమాదం అనంతరం సంస్థ యాజమాన్యం ఆమెకు వైద్య చికిత్స అందించినప్పటికీ, నష్టపరిహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కార్మికులు ఆరోపించారు. దీంతో తోటి కార్మికుల సూచన మేరకు బాధిత మహిళ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమమశక్తి అవార్డు గ్రహీత రవి కార్యాలయాన్ని ఆశ్రయించి తన సమస్యను వివరించింది. ఈ విషయంపై వెంటనే స్పందించిన ఆయన, సంస్థ యాజమాన్యాన్ని కలిసి బాధిత కార్మికురాలికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపి, బాధితురాలికి నష్టపరిహారంగా రూ.1,75,000 అందించేలా ఒప్పించారు. దీంతో శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి సింగ్ బాధిత కార్మికురాలి కుటుంబ సభ్యులకు రూ.1,75,000 విలువైన చెక్కును అందజేసింది. తమకు న్యాయం జరిగేలా కృషి చేసిన కార్మిక నాయకుడు రవికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ చారి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Recent Comments