Tuesday, September 29, 2026

కే పి హెచ్ బి తబలా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

📰 Generate e-Paper Clip

కూకట్ పల్లి: హైదరాబాద్  నుండి పాలకొల్లు కు వెళ్తున్న శ్రీ మల్లేశ్వర ట్రావెల్స్ NL02B9955 బస్సుకు రాత్రి అగ్ని ప్రమాదం కెపిహెచ్బిలోని తబ్లా రెస్టారెంట్ సమీపంలో సంభవించింది. డ్రైవర్ అప్రమత్రమై బస్సులో ఉన్న సుమారు 18 మంది ప్రయాణికులను సురక్షితంగా దించేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, ప్రయాణికులు తమ సామానులను కూడా సురక్షితంగా తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments