ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయాలి… ఎర్రవెల్లి జగన్..

సూర్య ఉదయం కూకట్ పల్లి….
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగా సమస్యలపైన, ఉన్నత విద్యపై తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని కలసిన తెలంగాణ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వారి నివాసంలో కలవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగా సమస్యలు, ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఆర్థిక దోపిడీ అరికట్టాలని, డొనేషన్స్ పేరిట కోట్ల డబ్బులు కొల్లాకొడుతున్నారని, అదేవిదంగా పెండింగ్ లో ఉన్న పీజ్ రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలనీ కోరడం జరిగింది.
ఒకవేళ ఉన్నతవిద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టి సరించకపోతే, రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నిరుపేద, బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య దూరం ఆయె అవకాశం ఉందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడి వీటిమీద చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి సంఘాలు, జెఎన్టీయూహెచ్ విద్యార్ధి సంఘాల నాయకులు కోరడం జరిగింది.
ఇట్టి అంశాలపైన సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాని తెలియజేయడం జరిగింది.
తదనంతరం వినతిపత్రం మహేష్ కుమార్ గౌడ్ కి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టీపీసీసీ ప్రోటోకాల్ సభ్యులు కెవి ప్రసాద్, దళిత సంఘాల నాయకులు మలాకి, ఓబీసీఫ్ అధ్యక్షులు సందీప్, క్రిస్టియన్ స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు మ్యాతువ్, డిఎస్ఎఫ్ ప్రెసిడెంట్ వివేక్ పటేల్, ప్రధాన కార్యదర్శి సతీష్ గౌడ్, జెఎన్టీయూహెచ్ విద్యార్థి సంఘాల నాయకులు అలెక్స్, దినకర్, జానీ, రాహుల్, అభిషేక్ వర్మ, సుదీర్, ప్రేమ్ సాగర్, యస్వంత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Recent Comments