
సూర్య ఉదయం ప్రతినిధి..
తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ సంఘం అధ్యక్షుడు లావుడ్య రాములు నాయక్, రాష్ట్ర ఉపాధక్షుడు కార్తీక్ బోట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ జిల్లా ఉప సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో నిర్వహించిన ఎన్నికల్లో నరేష్ ను ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా,పర్వతగిరి మండలం ఏబీ తండా గ్రామ ఉప సర్పంచ్ బీఎస్ నాయక్ ను గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామకపాత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బిఎస్ నాయక్ మాట్లాడుతూ…నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న అన్ని ఉప సర్పంచ్‌లకు, సహకరించిన సర్పంచ్‌లకు, జిల్లా అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే “జిల్లా స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఉప సర్పంచ్‌ల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని గ్రామీణాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం. ఉప సర్పంచ్‌లు గ్రామ స్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అభివృద్ధి పనుల్లో వారి పాత్రను మరింత బలోపేతం చేసేందుకు అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తాం.ఈ ఎన్నికల్లో ఉప సర్పంచ్‌లు ఏకతా భావనతో ఉన్నత నాయకత్వాన్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని కొత్త నాయకులు గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు ఉప సర్పంచ్‌ల హక్కుల సంరక్షణ కోసం క్రియాశీలకంగా పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఉప సర్పంచ్‌లు, సర్పంచ్‌లు, పంచాయతీ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Recent Comments