Tuesday, September 29, 2026

ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు

📰 Generate e-Paper Clip

సూర్య ఉదయం ప్రతినిధి, జోగులాంబ గద్వాల జిల్లా: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఆదేశానుసారం గద్వాల రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం రోజు గద్వాల ప్రాంత ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖ తరపున ఈ నెల 13 నుంచి 18 వరకు రహదారి భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రజలకు, ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, రహదారి ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఆటో డ్రైవర్లకు దగ్గరుండి కంటి పరీక్షలు చేయించడం జరిగిందని రూరల్ తెలిపారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు రహదారి భద్రత వారోత్సవాలను తప్పక పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ తో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments