Friday, April 17, 2026

కెపిహెచ్బి జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న ఫిష్ మార్కెట్ ఇప్పుడు ఫిషరీ శాఖకు మార్చడం జరిగింది

తెలంగాణ ప్రభుత్వం పశువర్ధక పాడి పరిశ్రమ మృత్యు శాఖ (fisheriers) మరియు క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, (ముదిరాజులు మరియు గంగపుత్రుల సంఘం అధ్యక్షుడు రాజు ముదిరాజ్, AMC డైరెక్టర్ ఫణీంద్ర కుమార్ ఉన్నారు. కెపిహెచ్బి జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న ఫిష్ మార్కెట్ ఇప్పుడు ఫిషరీ శాఖకు మార్చడం జరిగింది. కావున మంత్రి ని ఒకసారి వచ్చి పరిశీలించాల్సిందిగా. మరియు బిల్డింగు రిపేరు చేపియల్సిందిగా విన్నవించాము. గంగ పుత్రులు ముదిరాజులు ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకు అర్హులకు అందజేయాల్సిందిగా కోరడం జరిగింది. మంత్రి కచ్చితంగా వారం రోజుల్లో వస్తానని చెప్పారు. గతంలో జోనల్ కమిషనర్ మమత మరియు గత పదేళ్ల పందికొక్కుల ప్రభుత్వంలో. పేదల పేరు మీద తీసుకొని వాళ్ల పార్టీ బినామీలకు ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసి కి కట్టాల్సింది 1000 రూపాయలు ఉండగా పందికొక్కులు బినామీలు 15 వేల నుండి 25 వేల వరకు వసూలు చేశారు. ప్రతి దానికి సాక్షాదాలలో సహా మా వద్ద ఉన్నాయి. ఈ విషయమై కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ సహకారంతో గత రెండు సంవత్సరాలుగా జిహెచ్ఎంసి నిర్వహించే ఫిష్ మార్కెట్ ని అర్హులైన వారికి ఇవ్వాలని ఫిషరీ శాఖ నిర్వహించాలని, శాఖ మంత్రి ని, చైర్మన్ ని, ప్రముఖులను కలిసి విన్నవించుకోవడం జరిగింది. కావున ఫిష్ మార్కెట్ ఇప్పుడు ఫిషరీ శాఖకు బదలాయించడం జరిగింది.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!