
టౌన్ ప్లాన్ అధికారులారా పర్మిషన్ ఎలా ఇచ్చారు…
దీనిపై చర్యలు తీసుకుంటారా లేదా.
లేక ముడుపులకి ఆశపడి అండగా ఉంటారా..
ఫ్లాట్స్ కొన్నవారికి పంగనామే..
దీనిపై జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు..
సూర్య ఉదయం కూకట్ పల్లి
కూకట్ పల్లి బాలాజీ నగర్ డివిజన్ మూడవ ఫేస్ భువన విజయం గ్రౌండ్ దగ్గర ఎంఐజి 2, ఫ్లాట్ 824 లో ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు, రెండు ఫ్లాట్లు ఒక నిర్మాణం అంటూ జిహెచ్ఎంసి అధికారుల పర్మిషన్ తీసుకున్నామని నమ్మ చెబుతూ ఈ అక్రమ నిర్ణయానికి పాల్పడుతున్నారు .ఒకసారి ఈ పర్మిషన్ ని పరిశీలించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతున్నది. మరి జిహెచ్ఎంసి నిబంధనలను కాలరాస్తూ ఇలాంటి అక్రమ నిర్మాణాలను చేపడుతుంటే మీ కంటికి కానరావడం లేదా. లేక ముడుపులకు ఆశపడి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు అండగా ఉంటున్నారా అని ఒక ఆలోచన ప్రజల మనసులో మదలుతున్నది. వెంటనే జిహెచ్ఎంసి నిబంధనలను పాటించకుండా నిర్మాణం చేపట్టిన ఈ అక్రమ నిర్మాణం పై సరైన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతున్నది. మరి ఇంత భారీ అక్రమ నిర్మాణనానికి లక్షల్లో ఖర్చుపెట్టి కోట్లల్లో లాభాలు పొందుతున్న బిల్డర్ మూడు పూవులు ఆరు కాయలుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఈ బిల్డర్ ఏ నిర్మాణం చేపట్టిన జిహెచ్ఎంసి కి విరుద్ధంగానే నిర్మిస్తుంటాడు ఈ కేపిహెచ్బిలో అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈ బిల్డర్ పెద్ద భవనాలు నిర్మాణం లక్షల తో సెటిల్మెంంట్ట్ కోట్లలలో లాభం. మరి ఈ భవనంలో నిర్మించిన ఫ్లాట్స్ ని కొన్న కస్టమర్ కి ఇటువంటి సమాచారం తెలియకపోవడమే వీరి లాభం. అమ్మినవారికి లాభం కొన్నవారికి నష్టం అమాయక ప్రజలు ను మోసపూరితంగా మసిపూసి మాయ చేసి అమ్మేస్తున్న బిల్డర్లు. రేపటి రాబోయే సంచికలో కె.పి.హెచ్ బి లో బిల్డర్ల బాగోతం..

Recent Comments