దుండిగల్‌లో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
కుత్బుల్లాపూర్: కరీదైన ప్రాంతంగా భావించే జూబ్లీహిల్స్‌లోని టీవీ5 కార్యాలయం వెనుక 1600 ల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా గురువారం కాపాడింది. అలాగే దుండిగల్, గండిమైసమ్మ మండలం దొమ్మరపోచంపల్లి విలేజ్‌లో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా పరిరక్షించింది. జూబ్లీహిల్స్‌లో ప్రదీప్ కుమార్ లాహోటి, సుభాష్ కుమార్ లాహోటిలు 11,700ల గజాల మేర రెండు లే ఔట్‌లు వేశారు. మధ్యలో 1600ల గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఈ పార్కు స్థలం తమదంటూ అక్కడి స్థానికులు తప్పుడు పత్రాలతో ఆక్రమణకు పాల్పడ్డారు. వారి మీద కేసులు కూడా పెట్టారు. ఇలా కాపాడిన పార్కు మళ్లీ ఆక్రమణలకు గురయ్యే ప్రమాదముందని ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా గురువారం ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
దుండిగల్ – గండిమైసమ్మ మండలంలో
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ – గండిమైసమ్మ మండలం దొమ్మర పోచంపల్లిలోని 120/1, 120/28 సర్వే నంబర్లలో 4.15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పలుమార్లు ఆక్రమణలు జరిగితే.. ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తూ వచ్చింది ప్రభుత్వం. మళ్లీ ఆక్రమణలకు గురౌతుందని భావించిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హైడ్రాకు లేఖ రాశారు. ఆ భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ వినతి మేరకు గురువారం ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.

Recent Comments