Sunday, April 26, 2026

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవ పూజా కార్యక్రమం..

ప్రగతి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవ పూజా కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా తుంపాల వెంకటేశ్వరరావు, పెంట శ్రీనివాసరావు, తాతారావు హాజరై పూజల్లో పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రగతి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కమిటీ అధ్యక్షుడు వీరమల్లు రమేష్, ఉపాధ్యక్షుడు తూమాటి శంకరరావు, జనరల్ సెక్రటరీ శ్రీరామదాసు నరసింహ చారి, ట్రెజరర్ పట్నాల వెంకటరాజు, జాయింట్ సెక్రటరీ సునీల్, ముఖ్య కార్యదర్శులు రవిశంకర్, ఉపేందర్, ఈశ్వర్ రావు విశ్వబ్రాహ్మణ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!