– ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రీతం రెడ్డి

భారత రాజ్యాంగ నిర్మాత ,బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి వందనాలు తెలుపుతూ ఈరోజ 9వ ఫేస్ కాలనీ లో కొప్పు కళ్యాణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెపిహెచ్బి బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రీతం రెడ్డి పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఒక్కటే రచించడం కాదు పేద బడుగు వర్గాల అందరు సమానత్వమే అనే విధానాన్ని తీసుకువచ్చారు ప్రతి ఒక్క పౌరుడు ఆయన దారిలో నడవాలని తెలియజేశారు . అలాగే ఈ కార్యక్రమంలో 200 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగినది, ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అంబేద్కర్ గారి జయంతి అనగానే అందరికీ సమానత్వంగా జరుపుకొని ఒక పండుగని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్ భాషా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్మిక నాయకుడు ఆనంద్, మల్లేశం, జీడి సునీల్ కుమార్, శిరీష, రజిని రుద్రమ, సంజీవ్, ప్రశాంత్, బాలు, అమర్, గణేష్, శివ లీల, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Recent Comments