Monday, August 3, 2026

కూకట్ పల్లి లో ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు

– పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలకు నాయకులు నివాళ్లు
– మజ్జిక, స్వీట్లు పంపిణీ

కూకట్ పల్లి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 103 వ జయంతిని పురస్కరించుకొని, కేపిహెచ్ బి 114 డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, జేఎన్టియు సర్కిల్ లోని ఎన్ టి ఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు భారీ గజమాల వేసి తెదేపా కుటుంబ సభ్యుల సమక్షంలో ఘననివాళి అర్పించి, బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
తదుపరి బైకు ర్యాలీగా వెళ్లి కేపిహెచ్ బి ఫేజ్-3 రమ్య మైదానం వద్ద గల తెదేపా దిమ్మె వద్ద ఎన్ టి ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి, కేక్ కట్ చేసి మజ్జిగ ప్యాకెట్లు మరియు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వసంత నగర్ బస్టాప్ లోని ఎన్ టి ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యురాలు ఉప్పల పద్మా చౌదరి, డివిజన్ సీనియర్ నాయకులు షేక్ సత్తార్, అట్లూరి దీపక్, శివసత్యనారాయణ, వాసిరెడ్డి లక్ష్మీనారాయణ, చిరుమామిళ్ళ ఉమ, సుబ్బారావు, చందర్రావు, జాస్తి రమాదేవి, కొల్లూరి శ్రీనివాస్, కాకర్ల గోపికృష్ణ చౌదరి, కిషోర్ కేతినేని, కే వి ఆర్ చౌదరి, చెరుకూరి రవి, ఆర్ కే చౌదరి, కంకణంపాటి కృష్ణకిషోర్, పవన్ మార్ని, దొప్పలపూడి మదన్మోహన్, జాస్తి శ్రీధర్, నారాయణరావు, అన్నే శాస్త్రి, కోటేశ్వరరావు, నరేంద్ర, దొరబాబు,సాయి కుమార్, జంపాని సాయి, గౌతమ్, మణిదీప్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!