Sunday, April 26, 2026

కూకట్పల్లి లో కాంగ్రెస్ నేతల కబ్జా బాగోతం…

బయటపడ్డ కాంగ్రెస్ నేతల కబ్జా బాగోతం

బెంబేలెత్తిన బండి…

అవసరం లేకున్నా ప్రెస్ మీట్ పేరుతో ప్రతిపక్ష ఏమ్మెల్యే పై ఆరోపణలు…

అధికార మదంతో కళ్లు మూసుకుపోయిన బండి…..

కండువా లేకుండా కాలుబయట పెట్టని బండి గురువింద నీతులు….

బండి ని జోకర్ లా చూస్తున్న క్యాడర్…

అక్రమ నిర్మాణంలోనే ఆఫీస్ పెట్టుకుని గగ్గోలు….

గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం తో బండి గుండెల్లో రైళ్లు….

పేదలకు పెద్దలకు అన్ని వర్గాలను బి ఆర్ ఎస్ హయాంలోనే న్యాయం….

 

*అధికారమదంతో కళ్లు మూసుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పారాచూట్ నాయకుడు బండి రమేష్ కు గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని బి ఆర్ యస్ పార్టీ బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శి లు ప్రభాకర్ గౌడ్ వెంకటేష్ లు విమర్శించారు. అసలు శనివారం కాంగ్రెస్ నాయకుడు బండి రమేష్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఎవరికైనా తెలుసా?… అతను అతని మనసుల ద్వారా నడిపిన కబ్జా బాగోతం బయటపడటంతో పాటు కొందరు వ్యక్తులపై కేసులు నమోదు కావడంతో హడలెత్తిపోయి ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష పార్టీకి చెందిన మా ఏమ్మెల్యే మాదవరం కృష్ణారావుపై మా పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు గమనించాల్సిన విషయం ఏమంటే అల్లాపూర్ లోని సర్వే నంబర్ 18 లో నాలుగు ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం హయాంలో ఉర్దూ, ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ కోసం కేటాయించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు కబ్జా దారులు కాంగ్రెసు స్థానిక ముఖ్య నాయకులను కలుపుకొని భూమిని స్వాహా చేసేందుకు తెరవెనుక కథ నడిపారు.. తీరా తెరముందు స్థలాన్ని స్వాధీనం చేసుకుని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టగానే విషయం తెలుసుకున్న ఏమ్మెల్యే వెంటనే స్పందించి కలెక్టర్ కు, తహసీల్దార్ కు, ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి కబ్జా బాగోతాన్ని బహిరంగం చేశారు. దీంతో వారంతా స్పందించి కబ్జాను అడ్డుకుని కబ్జా దారులపై కేసులు పెట్టారు… ఇది జీర్ణించుకోలేని బండి ప్రెస్ మీట్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడ్డారు.. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ మహా నగరం, కూకట్పల్లి నియోజకవర్గం పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో సాగింది. కూకట్పల్లి నియోజకవర్గం లో బాలానగర్ ఫ్లై ఓవర్, హౌసింగ్ బోర్డు ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు కట్టింది ఎవరు కట్టించింది ఎవరు కేవలం ఆ ఘనత మా నాయకుడు హ్యాట్రిక్ ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది. గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి పైప్ లైన్లు వేసింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే. పార్కులు, అట స్థలాలు అభివృద్ధి చేసింది అతనే.. 100 పడకల ఆసుపత్రి మొదలుకొని ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ, సున్నం చెరువు నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ పనులను గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా కనీసం పురోగతి లేదంటే సిగ్గు పడాల్సింది పోయి తగుదునమ్మా అంటూ విలేకరుల సమావేశంలో విర్రవీగుతూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. బస్తీ దవాఖానాలు, పేదలకు సంక్షేమ పథకాలు అందించిన బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది. దమ్ముంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అంతే కానీ అనవసరపు ఆరోపణలతో ప్రజలను ఏమార్చాలని చూస్తే నిందమునిగేది నువ్వే అనే సంగతి మర్చిపోకు బండి…

బండి నువ్వొక జోకర్….

నీ పార్టీ వారే నిన్ను చూసి నవ్వుతారు…

కాంగ్రెస్ పార్టీలోకి గడిచిన ఎన్నికల ముందు డబ్బు ముఠాలతో టిక్కెట్టు కొనుక్కొని వచ్చి పోటీ చేసి ఘోర పరాజయం పాలైన బండి రమేష్ తనకు తానే బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. రోజు మెడలో కండువా లేనిదే గుర్తుపట్టరు అనుకునే సంకుచిత మనస్తత్వం తో సీనియర్ కాంగ్రెస్ శ్రేణులను వెంటబెట్టుకుని ముఖంపై కపట ప్రేమను ఒలకబోస్తున్న నిన్ను చూసి నీ పార్టీ వారే నవ్వుకుంటున్నారు. ఎన్ని పార్టీలు మారినా ని తలరాత మారలేదనే కోపంతో నీకు నువ్వే శకలక శంకర్ లాగా ఫీల్ అవుతున్నావ్ అని ని క్యాడర్ గుసగుసలాడుతుంది. కనీసం ఒక్క సారి కూడా వార్డు మెంబర్ గా కూడా గెలవని నీకు మా పార్టీని మా పార్టీ ఏమ్మెల్యే ను విమర్శించే నైతిక హక్కు లేదు గుర్తుపెట్టుకో.. మా ఏమ్మెల్యే గత 36 ఎండ్లగా నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తుంటే జీర్ణించుకోలేక లేని పోనీ ఆరోపణలతో ప్రేలాపనలకు దిగుతున్నావు.. జేఎన్టీయూ స్కై వేలు, గోద్రేజ్ జంక్షన్ అభివృద్ధి పనులకు మోక్షం మా ఏమ్మెల్యే చేసిన కృషి మూలంగా పనులు ముందుకు సాగుతున్నాయని కూకట్పల్లి మొత్తం తెలుసు.. క్రెడిట్ చోరీ కోసం నీకు నువ్వు డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు.. ముందు నీ డాంబికాలూ ఆపి ప్రజలకు అవసరమై పనులను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయి. కావాలంటే ప్రతిపక్ష పార్టీగా సహకారం అందిస్తాము. అంతే గాని కేవలం ఆరోపణలతో ఇతరులపై బురదజల్లి రాజకీయాలు చేద్దాం అనుకుంటే నీకు రాబోయే ఎన్నికల్లో కూడా శూన్య హస్తం తప్పదు.. ఖబర్దార్ బండి రమేష్ మళ్లీ ఒకసారి మా ఏమ్మెల్యే ను విమర్శించాలని చూస్తే తగిన సమాధానం చెప్పాలి వస్తుంది.. అక్రమ నిర్మాణాలు గురించి మాట్లాడుతున్నావు నీవు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏ నిర్మాణం.. నీవు అక్రమ నిర్మాణాలు చేస్తావు నీ సొంత బిల్డింగ్ అక్రమ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నడుపుతావు సిగ్గు ఎగ్గు లేదు మరి నీకు పేద మధ్యతరగతి కి చెందిన ఆల్విన్ ఎంప్లాయిస్ భూములు లాక్కుంటవు.ప్రజలు నుండి మీ పార్టీ నాయకులు గడిచిన రెండేళ్ళుగా ఖాళీ స్థలాలు కబ్జా చేస్తున్నారు. ఎక్కడ ఇల్లు కట్టుకున్నారో చూస్తూ అక్కడ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. గురివింద నీతులు చెపుతూ ఎవరినీ మోసం చేయలేరు గుర్తుపెట్టుకో. చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునే అవకాశం కలించిన ఘనత మా ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు గారికి దక్కుతుంది. ఐడీఎల్ చెరువు కట్టపై వ్యాపారం చేసుకున్న వారికి వెండర్ గుర్తింపు కార్డులను అందజేయడంతో పాటు వారిని అక్కడి నుంచి తొలగించాల్సిన తప్పని పరిస్థితి వస్తే హౌసింగ్ బోర్డు లోని రైల్ ఓవర్ బ్రిడ్జి కిందకు మార్చి వారి కోసం షెడ్ లను కూడా నిర్మించడం జరిగింది. అంతే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారిని అర్ధాంతరంగా రోడ్డున పడేయలేదు.. అసలు బండి రమేష్ పుట్టక ముందు నుంచే హైదరాబాద్ లో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారు పుట్టారు. నాటి నుంచి నేటి వరకు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటున్నారు.. నువ్వేదో వారికి న్యాయం చెసినట్లుగా బిల్డప్ ఇస్తూ రోజుకో చోట కుల్కివేతలని చూపిస్తూ రెచ్చిపోతున్నావు. నిరుపేదల ఊసురు తాకితే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తప్పదు తస్మాత్ జాగ్రత ..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!