సూర్య ఉదయం ప్రతినిధి, కుత్బుల్లాపూర్:
షాపూర్‌నగర్‌లో భారతీయ జనతా పార్టీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు, స్థానిక మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరై నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులై బాధ్యతలు చేపడుతున్న గిరి వర్ధన్ రెడ్డి ని శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ, నూతన జిల్లా కార్యాలయం పార్టీ కార్యక్రమాలకు కేంద్రబిందువుగా నిలవాలని, జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి పార్టీ తరఫున నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, బీజేపీకి కార్యకర్తలే వెన్నెముక అని, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని అన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న గిరి వర్ధన్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రతి కార్యకర్తను కలుపుకొని జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా బిజెపి సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, డివిజన్ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Recent Comments