Wednesday, September 30, 2026

మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ

📰 Generate e-Paper Clip

కూకట్ పల్లి: మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్లాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్ పల్లి దయార్ గూడా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సొంత నిధులతో వారికి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖార్డ్ సంస్థ చైర్మన్ సుమన్, మధులత దంపతులు, కూకట్పల్లి సీతారామచంద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తులసీరావ్, సంతోష్, ప్రభాకర్, బొట్టు విష్ణు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments