Tuesday, September 29, 2026

బాలానగర్ గణనాథుడి సేవలో హీరో మంచు మనోజ్..

📰 Generate e-Paper Clip

బాలానగర్ గణనాథుడి సేవలో హీరో మంచు మనోజ్.. వినాయకనగర్‌లో అభిమానుల కోలాహలం..

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి..

వినాయక చవితి పండగను పురస్కరించుకుని టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ భక్తిశ్రద్ధలతో విగ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. బాలానగర్ పరిధిలోని వినాయకనగర్‌లో వెలసిన గణనాథుడి వద్దకు చేరుకున్న ఆయన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కులు చెల్లించుకున్నారు.

 

యువ హీరో మనోజ్ రాకతో వినాయకనగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడిని నేరుగా చూసేందుకు యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ నిర్వాహకులు, స్థానిక భక్తులతో కలిసి మనోజ్ కాసేపు సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు, అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

మంచు మనోజ్ పర్యటన సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మనోజ్ మాట్లాడుతూ — “తెలుగు ప్రజలందరూ ఈ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి” అని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నవీన్ ఫాన్స్ అధినేత జి. నవీన్‌కుమార్ కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు కె. రాజు గౌడ్, ఆర్. సతీష్, ఆశిష్, ఆకుల నరేందర్. వేణు గోపాల్, రాము ముదిరాజ్, రిషి యాదవ్, ప్రభారెడ్డి, వినాయకనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాశం శ్రీనివాస్, సతీష్, గిరి, పెద్ద సంఖ్యలో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments