Tuesday, September 29, 2026

కాసులకు సై సై….చర్యలకు నై నై.. అంటున్న టిపిఓ…..

📰 Generate e-Paper Clip

 

15వ ఫేసులో 300 గజాలలో భారీ అక్రమ షెడ్డు నిర్మాణం….

అక్రమ షెడ్డు కి టిపిఓ అధికారులే అండగా ఉన్నార….

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…

కూకట్పల్లి నియోజకవర్గం కైతలాపూర్ డివిజన్ వెంకటరమణ కాలనీ 15 పేస్ లో 300 గజాలలో భారీ అక్రమ షెడ్డు నిర్మాణం జిహెచ్ఎంసి నన్స్ ప్రకారం ఐరన్ షెడ్లకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వబడదు కానీ కొందరు వ్యక్తులు జిహెచ్ఎంసి అధికారులతో కుమ్మక్కై 300 గజాల స్థలంలో ఒక కారు షెడ్డు నిర్మాణం చేపడుతున్నారు ఇటువంటి నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కానీ ఇక్కడ ఈ అక్రమ నిర్మాణ షెడ్డుకి అండగా అధికారులే ఉన్నారని వినికిడి దీనిపై ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా చూడాలని డిప్యూటీ కమిషనర్ కూడా వినతిపత్రం అందజేయబడుతుంది అని చెప్పుకొచ్చారు కాలనీవాసులు . అధికారులు కాసులకు కక్కుర్తి పడి వృత్తిని మరిచారని అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోని తన వృత్తికి న్యాయం చేయాలని తెలియజేశారు…

 

రేపటి రాబోయే కథనం…

అంజయ్య నగర్ లో భారీ అక్రమ నిర్మాణాలు… కాంగ్రెస్ నాయకుడి ఏడంతస్తుల అక్రమ నిర్మాణం…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments