Sunday, May 3, 2026

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి

కూకట్ పల్లి: ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి తమ దురాలోచనలు మానుకొని అలాగే పదివేల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని జెఎన్టిహెచ్ క్యాంపస్ ప్రెసిడెంట్ దీపిక డిమాండ్ చేశారు. జేఎన్టీయూహెచ్ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ట్ పై విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ట్ పథకాన్ని ఎత్తివేయాలని చూడడం చాలా బాధాకరం. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దతించేంతవరకు ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాం. కావున ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి తమ దురాలోచనలు మానుకొని అలాగే పదివేల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. అనంతరం క్యాంపస్ వైస్ ప్రెసిడెంట్ నవదీప్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యల వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు అలాగే వాళ్ళు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు. స్కాలర్షిప్ ప్రభుత్వ బిక్ష కాదు అది విద్యార్థుల హక్కు అనే విషయాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించుకొని వెంటనే తగు చర్యలకు రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించకపోతే ఈ జేఎన్టీయూహెచ్ వేదికగా మళ్లీ విద్యార్థి ఉద్యమాలకు పురుడుపోస్తామని అని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!