Tuesday, September 29, 2026

యూనివర్సిటీలో విద్యార్థులు బాయ్ కాట్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో విద్యార్థులు క్లాసులు బాయ్ కాట్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలు రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తిరిగి రిపోర్టింగ్ ఇవ్వకపోవడం అనేది విద్యార్థుల హక్కులను, జీవితాలను కాలరాయటమే అని అన్నారు. ఫీజు అంబర్స్మెంట్ అనేది కాలేజ్ యాజమాన్యాలకు మరియు ప్రభుత్వనికి సంబంధించిన విషయం. ఈరోజు ఈ విషయంపై విద్యార్థులను మానసికంగా వేధించడం అనేది బాధాకరమైన విషయం. ప్రభుత్వ యూనివర్సిటీ అయినా జేఎన్టీయూ కూడా ఏప్రిల్ 30 లోపు ఫీజు రియంబర్స్మెంట్ రానీ విద్యార్థులను వెంటనే బకాయిలు చెల్లించాలని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అని అన్నారు. అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోతే ఏబీవీపీ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ఈ దగా కోరు ప్రభుత్వాన్ని గద్దతించేంతవరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఎన్టిహెచ్ ప్రెసిడెంట్ దీపిక, వైస్ ప్రెసిడెంట్ నవదీప్, జాయింట్ సెక్రెటరీ రాజేష్, కార్యకర్తలు విమల్, మనోజ్, సతీష్, అపూర్వ, శీను తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments