Wednesday, September 30, 2026

ఇచ్చోడ పట్టణ ఆరే మరాఠా సంఘం ఎన్నిక

📰 Generate e-Paper Clip

• సంఘం అధ్యక్షులుగా సాయికిరణ్ జాధవ్
• అధ్యక్షులు సాయికిరణ్ జాధవ్ కు ఘన సన్మానం

సూర్య ఉదయం,ఇచ్చోడ : మండల కేంద్రమైన ఇచ్చోడలో  ఆదివారం ఇచ్చోడ పట్టణ ఆరే మరాఠ సంఘం కార్యవర్గం ను ఎన్నుకున్నారు. జిల్లా సంఘం అధ్య క్షులు దశరథ్ పాటిల్ భోస్లే ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సాయికిరణ్ జాధవ్, ప్రధాన కార్యదర్శి గా పౌడే అనిల్, ఉపాధ్యక్షలుగా సుభాష్ పాన్పట్టే, పరమేశ్వర్ షిండే, థోరె తానాజీ, అశోక్ భోస్లే లు, జాయింట్ సెక్రెటరీలుగా చంద్రకాంత్ కదం, డుక్రె శ్యామ్, దినేష్ గైక్వాడ్, కదం శంకర్, కోశాధికారులుగా జ్ఞానేశ్వర్ గైక్వాడ్, మెండల్కర్ లక్ష్మణ్, పబ్లిసిటీ సెక్రటరీగా రాము జాధవ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా సాయి లాండ్గే, శుభం పాన్పాట్టే, సుమిత్ డుక్రె, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయికృష్ణ  పాన్పట్టే, గాడ్గే జ్ఞానేశ్వర్, సందీప్ కదం, అశోక్ చౌహన్, అక్షయ్ సూర్యవంశీ, శివ భోస్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సాయికిరణ్ జాధవ్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఆరే మరాఠా కులస్తుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. అనంతరం ఆయనను సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments