Tuesday, September 29, 2026

ట్రామా కేర్ సెంటర్ లో ట్రాఫిక్ పై అవగాహన

📰 Generate e-Paper Clip

కుత్బుల్లాపూర్: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐదవ రోజు “అరైవ్ అలైవ్” ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ట్రామా కేర్ సెంటర్, ఓ.ఆర్.ఆర్ ఎగ్జిట్-5 సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు తక్షణ సహాయక చర్యలపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారికి ఎలా స్పందించాలి, వారిని సురక్షితంగా ఎలా తరలించాలి, అనవసరంగా కదిలించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. అలాగే బ్లీడింగ్ కంట్రోల్ పద్ధతులు, గాయాలపై తక్షణ చికిత్స (First Aid) ఇవ్వడం, అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలో ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించడం జరిగింది. అదే విధంగా అత్యవసర సమయంలో 100/112 కి మరియు ఓ.ఆర్.ఆర్ ఎమర్జెన్సీ నెంబర్ 14449 కి కాల్ చేయాలని జీడిమెట్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింహ రావు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments