సూర్య ఉదయం,ఇచ్చోడ : మండల కేంద్రము లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల పూర్వ విద్యార్థి పాటిల్ జ్యోత్స్న ఇటీవల వెలువడిన గ్రూప్ -1 లో ఉద్యోగం సాధించిన సందర్భంగా పాఠశాల ఆచార్యులు, కమిటీ సభ్యులు అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఆచార్యులు, కమిటీ సభ్యులు చిన్నప్పటి నుండి చదువులో ఆమె ప్రతిభ ను ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత ఉద్యోగాలు సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్ సౌదా,యువరాజ్, శిశు మందిర్ పాఠశాల ఆచార్యులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments