సూర్య ఉదయం,ఆదిలాబాద్: గుడిహత్నూర్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని , ఇది ఒక హేయమైన చర్యాని గుడిహత్నూర్ మండల దళిత నాయకులు సత్యరాజ్ ఉపారపు అన్నారు. న్యాయమూర్తి గవాయ్ పై దాడిని నిరసిస్తూ బుధవారం గుడిహత్నూర్ మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ప్లకార్డులుతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సత్యరాజ్ మాట్లాడుతూ.. న్యాయవాది జరిపిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని,ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ అన్నారు.

న్యాయవ్యవస్థకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయని అన్నారు. న్యాయం చెప్పే గొంతుకలను బెదిరించడం, దాడులకు పాల్పడటం సరైది కాదని, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కళ్లేపల్లి ప్రశాంత్, మదినే రాహుల్, సునీల్,విజయ్, బావే రాహుల్, రవి, శ్రీకాంత్, విజయ్ మహేష్ రకేష్ సందీప్ వినోద్,తదితరులు ఉన్నారు.

Recent Comments