సూర్య ఉదయం,భీంపూర్: మండలంలోని అందర్ బంద్,కరంజి(టీ) గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు ఆదివారం జిల్లా అధ్యక్షులు పతాంగే బ్రహ్మానంద్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆదివారం భీంపూర్ మండలం వాడేగావ్ గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. భీంపూర్ మండల జడ్పిటిసి,ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లు జిల్లా అధ్యక్షులకు అందించడం జరిగిందనీ మండల అధ్యక్షుడు అంకం అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి రాజు, నాయకులు గుర్ల నారాయణ, వెంకటేష్, రాకేష్, రమేష్, గంగన్న, భోజన్న, సంజీవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments