కూకట్ పల్లి: క్రి. శే. కాపవరపు లక్ష్మీ పెరుమాళ్లు మరియు కాపవరపు పుండరీకాక్షుడు (మాస్టర్) గౌరవార్ధం వాళ్ళ పెద్ద అబ్బాయి కువైట్ దేశం లో నివాసం ఉంటున్న కె.వి మధుసూదనరావు (1989-90) బ్యాచ్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల జమీదగ్గుమిల్లి (కాపవరపు పుండరీకాక్షు శుద్ధి చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్) ద్వారా పాఠశాల వజ్రోత్సవ ఖర్చులు నిమిత్తం 12,500/- మరియు పాఠశాల భవిష్యత్తు అభివృద్ధి కార్యాచరణ ను అభినందిస్తూ ట్రస్ట్ కు మరో 12,500/- విరాళాలను ప్రకటించారు. కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీ లోని కే పి సి ఎడ్యుకేషనల్ మెమోరియల్ ఫౌండేషన్ ఇంచార్జ్ కేవీ సాంబశివరావు, ఏ వెంకటేశ్వరరావు వారి కార్యాలయంలో 25,000/- రూపాయల చెక్కు ను తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ చేతుల మీదుగా ట్రస్ట్ తరపున కాకర్ల.దుర్గా ప్రసాద్, కే సురేష్ కుమార్ కు అందజేయడం జరిగింది. పుండరీకాక్షుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటు, వారి కుటుంబానికి జడ్.పి.హెచ్.ఎస్ జమ్మిడాకుమిల్లి వజ్రోత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంస్థ కార్యనిర్వక అధ్యక్షులు జీ బ్రహ్మేంద్ర, కరీం, మనీ, మహేష్, రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
ట్రస్టు కు విరాళం
RELATED ARTICLES

Recent Comments