suryaudhayam.in
Date of Publish : 19 April 2026, 7:23 pm Posted by : SURYA UDHAYAM MEDIA

70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత ‘ఆయుష్మాన్ భారత్’ కార్డుల నమోదు

ఎమ్మిగనూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందేందుకు 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులందరూ అర్హులని ఎమ్మిగనూరు పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్డు నమోదు కొరకు 20-04-2026 సోమవారం నాడు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు నారాయణ స్కూల్ ఎదురుగా ఉన్న  భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయం లో ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొని రావాలని మరిన్ని వివరాలకు 7993682413 నెంబర్‌ను సంప్రదించవచ్చు అని నాయకులు తెలిపారు.